Asianet News TeluguAsianet News Telugu

మంత్రి శ్రీరంగనాథరాజు దాతృత్వం: గుంటూరు జీజీహెచ్‌కు కోటి విరాళం

మంత్రి శ్రీరంగనాథరాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించిన గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించారు. 

ap minister sri ranganatha raju 1 crore donation for GGH guntur ksp
Author
Guntur, First Published Oct 15, 2020, 3:03 PM IST

మంత్రి శ్రీరంగనాథరాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించిన గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల ప్రజలకు జీజీహెచ్ వైద్య సేవలు అందిస్తోందని మంత్రి తెలిపారు.

ఆసుపత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటలా భోజన వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని.. దీనిలో భాగంగానే వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు విరాళం అందజేస్తున్నానని శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు. కరోనా రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని రంగనాథరాజు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios