Asianet News TeluguAsianet News Telugu

నాపై పోటీ చేయాలి, కుప్పంలో డిపాజిట్ రాదు: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్

తనపై పోటీ చేయాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సవాల్ విసిరారు.  కుప్పంలో  చంద్రబాబుకు డిపాజిట్ రాదని  ఆయన  అభిప్రాయపడ్డారు. 
 

AP Minister  Peddireddy Ramachandra Reddy Challenges To  TDP Chief Chandrababu
Author
First Published Jan 16, 2023, 8:03 PM IST

చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్ జైలులో  టీడీపీ కార్యకర్తలను  చంద్రబాబునాయుడు  సోమవారం నాడు పరామర్శించారు.  వైసీపీ సర్కార్ పై  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు  తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలపై  ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  స్పందించారు.

కుప్పంలో   వైసీపీ అభ్యర్ధిగా  పోటీ చేసేందుకు తాను సిద్దంగా  ఉన్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెప్పారు.  పుంగనూరులో  తనపై  పోటీ చేసేందుకు  చంద్రబాబు సిద్దమా అని  ఆయన  సవాల్ విసిరారు. కుప్పంలో  చంద్రబాబునాయుడు పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్  కూడా రాదని  మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి చెప్పారు.

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఏడాదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  వైసీపీ ఘన విజయం సాధించింది.   టీడీపీ ఘోర పరాజయాన్ని  చవిచూసింది.  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా  ఉండాలని  టీడీపీ  అప్పట్లో నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా  ఉండాలని నిర్ణయం తీసుకున్నందున  తాము ఈ ఎన్నికలను సీరియస్ గా  తీసుకోలేదని  టీడీపీ నేతలు  అప్పట్లో ప్రకటించారు.  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు దఫాలు చంద్రబాబునాయుడు విజయం సాధించారు.  గత ఎన్నికల సమయంలో ఒక రౌండ్ లో  చంద్రబాబు వెనుకంజలో   నిలిచారు. 

కుప్పం మున్సిపాలిటీగా  ఏర్పాటైన తర్వాత  తొలిసారిగా  జరిగిన ఎన్నికల్లో  వైసీపీ జయకేతనం ఎగురవేసింది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కేంద్రీకరించారు.  వచ్చే ఎన్నికల్లో  కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా  వైసీపీ వ్యూహారచన చేస్తుంది.  దీంతో  కుప్పంలో  వైసీపీ  వ్యూహలకు  టీడీపీ  ప్రతి వ్యూహంతో  ముందుకు వెళ్తోంది.  కుప్పం నియోజకవర్గంలో  పరిణామాలను  చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీని బలోపేతం  చేసే దిశగా  చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం పార్టీ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్సీ  శ్రీనివాసులు నాయుడితో  మరికొందరు నేతలపై  స్థానిక నేతలు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

also read:చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 ఈ విషయమై  పలు దఫాలు చంద్రబాబుకు  పిర్యాదులు చేసినా పట్టించుకోలేదనే  విమర్శలు లేకపోలేదు.  స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత  చంద్రబాబునాయుడు కొన్ని చర్యలు తీసుకున్నారు.  కార్యకర్తలు  ఫిర్యాదు చేసిన నేతలను చంద్రబాబు పక్కకు తప్పించారు. గత ఏడాదిలో  కుప్పంలో  సీఎం జగన్ పర్యటించారు.  వచ్చే ఎన్నికల్లో కుప్పంలో  వైసీపీ అభ్యర్ధి భరత్ ను  గెలిపిస్తే   మంత్రి పదవిని ఇస్తానని  జగన్ హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios