ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుపై ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
హైదరాబాద్: ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుపై ఓవైసీ బ్రదర్స్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

టీడీపీని ఎద్దేవా చెయ్యడం, వ్యతిరేకంగా మాట్లాడటం ఓవైసీ బ్రదర్స్ కి సరికాదన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అయినంత మాత్రాన చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
మతత్వ శక్తులతో పోరాడుతున్న చంద్రబాబుకు ఓవైసీ బ్రదర్స్ మద్దతుగా నిలవాలని కోరారు. మోదీ హటావో, దేశ్ కీ బచావో నినాదంతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు ఓవైసీ బ్రదర్స్ సంఘీభావం ప్రకటించాలని మంత్రి ఫారూక్ సూచించారు.
