Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్:జనసేనానిపై ఏపీ మంత్రి కారుమూరి ఫైర్

చంద్రబాబు డైరెక్షన్ లోనే  పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఏపీ మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు  చెప్పారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల భేటీని మంత్రి  ప్రస్తావించారు.యువతను పవన్  కళ్యాణ్ చెడగొట్టే  ప్రయత్నం  చేస్తున్నారన్నారు.  

AP MInister  Karumuri Nageswara Rao Reacts  On Pawan Kalyan Comments
Author
First Published Oct 19, 2022, 10:44 AM IST

అమరావతి:చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  చెప్పారు.బుధవారంనాడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.నిన్నపవన్ కళ్యాణ్ తో  చంద్రబాబు భేటీ కావడమే ఇందుకు నిదర్శనంగా  ఆయన  పేర్కొన్నారు.చంద్రబాబును కలవడంతో పవన్ కళ్యాణ్  ముసుగు తొలగిపోయిందన్నారు

కాపు జాతిని అవమానించిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు మోస్తున్నారో చెప్పాలన్నారు.చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  ఎందుకు కొమ్ముకాస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీ  కోసం యువతను పక్కదారిని  పట్టించవద్దని  మంత్రి పవన్  ను  కోరారు.

విశాఖ గర్జన విజయవంతం కావడం చూసి  తట్టుకోలేక  జనసేన గుండాలు మంత్రుల కార్లపై దాడులకు దిగారని చెప్పారు. .కర్రలు,రాళ్లు,రాడ్లతో మంత్రులపై కార్లపై దాడికి దిగారన్నారు. ఈ ఘటనతో  యువతకు పవన్ కళ్యాణ్  ఏం  చెప్పదల్చుకున్నారని ఆయన అడిగారు.

alsoread:పవన్ కల్యాణ్ పై మానవహక్కుల కమిషన్ లో కేసు..

యువతకు పవన్  కళ్యాణ్  రౌడీయిజం నేర్పిస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి  నాగేశ్వరరావు ఆరోపించారు. కార్యకర్తలను  పవన్  కళ్యాణ్  రెచ్చగొడుతున్నారన్నారు.పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు  బూతులు నేర్పిస్తారా అని  ఆయన  ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలకు తాము ప్రతినిధులమన్నారు. తమపై దాడి చేస్తే ప్రజలపై దాడి చేసినట్టేనని మంత్రి కారుమూరి  నాగేశ్వరరావు  చెప్పారు.ప్రజలంటే  చంద్రబాబుకు ఎప్పుడూ ద్వేషమేనన్నారు.విశాఖపట్టణం, విజయవాడల్లో  పవన్ కళ్యాణ్ కు హోటల్స్   ఎవరూ  బుక్ చేశారో తమకు తెలుసునని మంత్రి చెప్పారు.

నిన్న పవన్ కళ్యాణ్  చేసిన తాటా  తీస్తానని  వ్యాఖ్యలను  ప్రస్తావిస్తూ ఇప్పటి వరకు ఎంతమంది తాటా తీశారో  చెప్పాలని కోరారు.యువతను సన్మార్గంలో నడిపేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే  పవన్  కళ్యాణ్ మాత్రం యువతను చెడగొట్టే  ప్రయత్నం  చేస్తున్నారని  ఆయన  మండిపడ్డారు. దేశంలో ఎక్కడా  లేని విధంగా  రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను అభివృద్ది  చేసిందని  ఆయన  గుర్తు చేశారు.

ఈ నెల 15న విశాఖపట్టణంలో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతు ప్రకటించింది.  ఈ    గర్జనలో  పాల్గొనేందుకు వచ్చిన మంత్రుల కార్లపై  జనసేన దాడికి దిగిందని  వైసీపీ  ఆరోపించింది.అయితే  ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన  ప్రకటించింది.మంత్రుల  కార్లపై వైసీపీయే దాడులు చేయించుకొందని జనసేన ఆరోపించింది. మంత్రుల కార్లపై దాడుల ఘటనలకు సంబంధించి జనసేన  కార్యకర్తలు,నేతలు 107 మందిపై  కేసులు   పెట్టి  పోలీసులు అరెస్ట్  చేశారు. ఈ విషయమై  పవన్ కళ్యాణ్  పై వైసీపీ  నేతలు విమర్శలు  చేశారు .పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ తీసుకుంటున్న  నేతగా  అభివర్ణించారు .ఈ వ్యాఖ్యలపై నిన్న  మంగళగిరిో  జరిగిన  పార్టీ కార్యకర్తల సమావేశంలో  పవన్  కళ్యాణ్ వైసీపీపై  విరుచుకుపడ్డారు.ప్యాకేజీ  తీసుకుంటున్నాడని విమర్శలు చేస్తే  చెప్పుతో కొడతా అంటూ  మండిపడ్డారు  ఈ   వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ,మంత్రులు  జనసేనానిపై విరుచుకుపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios