Asianet News TeluguAsianet News Telugu

ట్రాక్టర్లతో తొక్కించి చంపారు-వనజాక్షిపై దాడి చేశారు: పవన్ పై మంత్రి కన్నబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని ఇసుకతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ లాంగ్ మార్చ్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 
 

Ap minister Kannababu serious comments on pawan kalyan
Author
Tadepalli, First Published Nov 2, 2019, 3:56 PM IST

తాడేపల్లి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడికి దిగారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలు ఏమిటో పవన్ కు తెలియడం లేదా అని నిలదీశారు. 

ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌కు ఇవేమీ పట్టడం లేదని ఇసుకతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేశ్‌ దీక్ష చేస్తే వైజాగ్‌లో దత్తపుత్రుడు పవన్‌ లాంగ్ మార్చ్ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

కృత్రిమ పోరాటాలు చేయడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకే చెల్లిందని విమర్శించారు కన్నబాబు. పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లుగా జరిగిన ఇసుక మాఫియాపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. 

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలు రావడంతో ఇసుక తీయడం కష్టంగా మారిందన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 260 రీచ్‌లకు గానూ కేవలం 60 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని స్పష్టం చేశారు.  

రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయని స్పష్టం చేశారు. కరువు సీమలో కూడా పచ్చని పంటలు పండుతున్నాయన్నారు. 

వరదల వల్ల ఇసుక సంక్షోభం తలెత్తిందని అందువల్ల  చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాన్‌కు చాలా సంతోషంగా ఉందని విమర్శించారు. అందువల్లే కృత్రిమ పోరాటాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

వైజాగ్‌లో కొత్తగా పవన్ లాంగ్ మార్చ్ చేసేది ఏముందని గత ఐదేళ్లు చేస్తూనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. బీజేపీ సొంతంగా పోరాటం చేస్తామని ప్రకటించింది. లెఫ్ట్ పార్టీలు కూడా పవన్‌తో వేదిక పంచుకోమని స్పష్టం చేశాయి. 

పవన్ దీక్షకు టీడీపీ నేతలు జన సమీకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో బొగ్గు గనుల్లో తవ్వినట్లు నదిలో అక్రమంగా ఇసుకను తవ్విన విషయాన్ని గుర్తు చేశారు. 

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక అక్రమాలపై వార్తలు రాసిన రిపోర్టర్లపై టీడీపీ నేతలు దాడి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

అక్రమ ఇసుకను అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిపై మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు స్పందించలేదని అప్పుడు ఏమైపోయారని నిలదీశారు కన్నబాబు.  ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వారిని లారీలతో తొక్కించి చంపించారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారు అంటూ ప్రశ్నించారు. 

ఆనాడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదా అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ బంధం ఏనాడు విడిపోలేదన్నారు. వారి లాంగ్ జర్నీ కొనసాగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి పట్టడం లేదన్న కన్నబాబు చంద్రబాబు ఎజెండాను పవన్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.  అభూతకల్పనలు సృష్టించడంలో చంద్రబాబుది ప్రపంచంలో ప్రథమ స్థానమని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు హయాంలో లక్షలాది కార్మికులు వలసపోయారు. వాళ్లంతా ఇప్పుడు తిరిగి తమ సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇప్పటికైనా కలిసి పోటీ చేసిన వామపక్షాలు ఎందుకు తన నుంచి దూరమయ్యాయో పవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని కన్నబాబు హితవు పలికారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ నీది రాంగ్ మార్చ్, బాబుతో స్నేహం చేస్తే భవిష్యత్ కష్టమే: మంత్రి అనిల్

చంద్రబాబు అజాగ్రత్త వల్లే ఇసుక కొరత...తమిళనాడు, కర్ణాటకలు ఏం చేశాయంటే..: కొడాలి నాని

పవన్ లాంగ్ మార్చ్: వైసీపీ ఎత్తులు, ఎలక్షన్ సీన్ రిపీట్

Follow Us:
Download App:
  • android
  • ios