Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఏం చేస్తాడు లే అనుకున్నారు: మంత్రి కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే అని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. రూ. 65 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వేల కోట్ల అప్పులతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు. 

ap minister k.kannababu comments on ex cm chandrababu over agri gold scam
Author
Kakinada, First Published Oct 19, 2019, 7:07 PM IST

కాకినాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు నిధులు మంజూరు చేసి వారి జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని స్పష్టం చేశారు మంత్రి కురసాల కన్నబాబు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు.

ap minister k.kannababu comments on ex cm chandrababu over agri gold scam 

శనివారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు గతంలో బాధితులు ఆందోళన చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.  

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే అని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. రూ. 65 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వేల కోట్ల అప్పులతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు. 

ap minister k.kannababu comments on ex cm chandrababu over agri gold scam

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ మొదటగా రూ. 10 వేలలోపు డిపాజిట్లు ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా చెల్లించబోతోందని తెలిపారు. కన్నబాబు స్పష్టం చేశారు. 

రాజకీయాల్లో ఉన్న తాము ఇవాళ ఆనందం వ్యక్తం చేసే రోజు అని హర్షం వ్యక్తం చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున పోరాటం చేసిన తర్వాత తమ కార్యాలయంలోనే దాదాపు 80 శాతం మంది బాధితులు తమపేర్లు ఇచ్చారని వెల్లడించారు. 

ఇవ్వాళ ఏ కష్టం వచ్చినా వైఎస్‌ జగన్‌ ఉన్నాడనే ధైర్యంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ధీమాగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం వల్ల ప్రజాప్రతినిధులుగా తాము ఎంతో గర్వపడుతున్నామన్నారు రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. 

Follow Us:
Download App:
  • android
  • ios