అమరావతి: కోవిడ్ బాధితుల సేవలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి తనదైన పాత్ర పోషిస్తున్నారు. ట్విటర్ ద్వారా అవసరమైన సమాచారం అందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన చేసిన ట్వీట్‌కు రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించారు. 

 

 విశాఖపట్టణానికి చెందిన ఎన్. వరలక్ష్మి అనే పేషంట్ కంటి సమస్యతో బాధపడుతోంది. కోవిడ్ పేషంట్ అయిన ఆమెను నగరంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పరీక్షించిన డాక్టర్ అత్యవసర వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ విషయం హనుమ విహారికి తెలియసింది. దీంతో ఆయన .ట్విట్టర్ వేదికగా సహాయం చేయాలని కోరారు.ఈమెకు సాయంత్రం నాలుగులోపు వైద్యం అందకపోతే చూపు కోల్పోతుందని  సాయం చేయాలంటూ సోనుసూద్‌ను ట్యాగ్ చేశాడుఈ ట్వీట్‌కు రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి స్పందిస్తూ తనకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయమని కోరారు. వెంటనే స్పందించిన హనుమ... ఆ వివరాలను ఆయనకు అందించారు.