Asianet News TeluguAsianet News Telugu

పబ్లిసిటీ కోసం.. పుష్కరాల్లో 30 మందిని చంపేశారు: బాబుపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు

మీడియాలో ప్రచారం కోసం 30 మందిని పుష్కరాల్లో చంద్రబాబు చంపేశారని అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ల్యాబ్స్ పెంచుతున్నామని, టెస్టుల సామర్ధ్యం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. 

ap minister anil kumar yadav sensational comments on tdp chief chandrababu naidu
Author
Amaravathi, First Published Apr 28, 2020, 3:38 PM IST

మీడియాలో ప్రచారం కోసం 30 మందిని పుష్కరాల్లో చంద్రబాబు చంపేశారని అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ల్యాబ్స్ పెంచుతున్నామని, టెస్టుల సామర్ధ్యం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు దాక్కున్నారని... ఇలాంటి నాయకులకు సిగ్గుండాలని మంత్రి థ్వజమెత్తారు.

బాబు నీచ, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని.. దేశంలో కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉందన్నారు. కరోనా బాధితుల్లో ముఖ్యమంత్రి ధైర్యాన్ని నింపుతున్నారని... కోవిడ్ 19 నియంత్రణకు అన్ని చర్యలు జగన్ తీసుకుంటున్నారని అనిల్ ప్రశంసించారు.

చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరమని, ఎన్నికల కమిషనర్ వలనే గవర్నర్ బంగ్లాలో కరోనా వచ్చిందని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. నీచ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరని, కరోనా అనేది ఎవరికైనా రావచ్చని అనిల్ అన్నారు.

బ్రిటన్ ప్రధాని, రాజ కుటంబీకులకు కరోనా వచ్చిందని, ప్రభుత్వంపై బురద వేయడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయిన 1400 కోట్లు సున్నా వడ్డీ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించారని మంత్రి గుర్తుచేశారు.

ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం నాలుగు వేల కోట్లు కేటాయించారని, చంద్రబాబు ఫీజ్ రియంబర్స్ మెంట్ కోసం ఎగొట్టిన బకాయిలకు కూడా ఆయన 1,800 కోట్లు నిధులు కేటాయించారని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పక్క రాష్టంలో ఉంటున్న చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని, బుద్ది లేకుండా యనమల కేసులు దాస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టీడీపీ నేతలు తిన్నది అరక్క 12 గంటలు దీక్షలు చేస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు. ఏ ఒక్క టీడీపీ నేత అయిన ప్రజలకు సహాయం చేసారా..? చంద్రబాబుకు రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి, ఉండటానికి మాత్రం హైదరాబాద్ కావాలా అని అనిల్ కుమార్ నిలదీశారు.

దేవినేని ఉమా కేసీఆర్ చెప్పినట్లు ఎవరో తేల్చుకోవాలని, ఉమా రోడ్డు మీదకు రావడం నాలుగు మాటలు మాట్లాడడం తరువాత  వెళ్లి పడుకోవడం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కర్నూలు ఎంపి ఇంట్లో నాలుగురు డాక్టర్లకు పాజిటివ్ వస్తే చంద్రబాబు హేళన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న వారిని అభినందించాలని, కించపరచడం సరికాదని అనిల్ కుమార్ హితవు పలికారు. చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అని.... ర్యాపిడ్ టెస్టు కిట్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా కన్నా విమర్శలు చేయడంలో అర్ధం లేదన్నారు.

ఇంగిత జ్ఞానం లేని ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దౌర్భాగ్యమని, పక్క రాష్ట్రంలో కూర్చుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారుని మంత్రి ఎద్దేవా చేశారు. దేశం లో 4.5 శాతం కేసులు వస్తుంటే ఏపి లో కేవలం 1.5 శాతం మాత్రమే వస్తున్నాయని... దేశంలో 4.5 శాతం కేసులు వస్తుంటే, 1.5 శాతం మాత్రమే వస్తున్నాయని అనిల్ కుమార్ చెప్పారు.

ఏపీలో డెత్ రెట్ తక్కువగా ఉందని, డిశ్చార్జ్ రేటు ఎక్కువగా ఉందని మంత్రి గుర్తుచేశారు. ప్రజలను భయపెట్టకుండా సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారని, చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని లేఖ రాస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చివరకు ర్యాపిడ్ కిట్స్ పై కూడా రాజకీయం చేస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.

రాష్ట్రం లో డబ్బులు ఉన్నప్పుడు చంద్రబాబు రైతులకు ఏమి చేయలేదని, ఇంత కష్ట కాలంలో ఏపి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని ఆయన గుర్తుచేశారు. కనీసం 10 శాతం మండలాలు కూడా రెడ్ జోన్ లో లేవన్నారు.

రాష్ట్రం లో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు ఈ ప్రభుత్వం పై మాట్లాడే నైతిక హక్కు లేదని అనిల్ కుమార్ విమర్శించారు. చంద్రబాబు మంచి చేయక పోయినా పర్లేదు కానీ ప్రజలను భయ పెట్టొద్దని మంత్రి హితవు పలికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios