పోలవరం బ్యాక్ వాటర్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న అభ్యంతరాలపై స్పందించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. లవరం వల్ల తెలంగాణకు ముంపు లేదని.. తెలంగాణ ఎందుకు ఈ వాదన చేస్తుందో తెలియడం లేదని మంత్రి అన్నారు.
పోలవరం వల్ల తెలంగాణకు ముంపు వుందనేది అవాస్తవమన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఈ వాదన తెచ్చిందో అర్ధం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను వెనుక నుంచి నడుపుతోంది కేంద్రమేనని అన్నారు. పోలవరానికి కాళేశ్వరానికి పోలిక లేదన్నారు అంబటి. కాళేశ్వరానికి కేవలం రెండు టీఎంసీల బ్యారేజ్ మాత్రమేనన్న మంత్రి.. పోలవరం బ్యాక్ వాటర్‌పై ఉమ్మడి సర్వే అవసరం లేదన్నారు అంబటి రాంబాబు. బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదముంటే తాము ఊరుకుంటామా అని అంబటి ప్రశ్నించారు. పోలవరం ప్రారంభానికి ముందూ వరద వచ్చినప్పుడు భద్రాచలం మునిగిందని రాంబాబు గుర్తుచేశారు. పోలవరం వల్ల తెలంగాణకు ముంపు లేదని.. తెలంగాణ ఎందుకు ఈ వాదన చేస్తుందో తెలియడం లేదని మంత్రి అన్నారు. వైఎస్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని అంబటి రాంబాబు గుర్తుచేశారు.
ఇకపోతే... పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం బుధవారం వాడీవేడీగా జరిగిన సంగతి తెలిసిందే. బ్యాక్ వాటర్ సర్వేపై తెలుగు రాష్ట్రాలు తలో మాట చెప్పాయి. పోలవరం ముంపు సర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే బ్యాక్ వాటర్ ఉమ్మడి సర్వే ఉండదని ఏపీ ఈఎన్సీ అన్నారు. తెలంగాణ అభ్యంతరాలు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఏపీ సెక్రటరీ కూడా సర్వేకు ఒప్పుకున్నారని తెలంగాణ ప్రభుత్వం గుర్తుచేసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఉమ్మడి అధ్యయనం ఏది వుండబోదన్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెబితే దానిని పరిశీలిస్తామని మాత్రమే పీపీఏ చెప్పిందన్నారు. కేంద్ర జలశక్తి మంత్రితో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వుంటుందని చెప్పినట్లు శశిభూషణ్ పేర్కొన్నారు. ఇక భూసేకరణపైనా సమావేశంలో చర్చ జరిగిందని ఆయన చెప్పారు.
Also REad:పోలవరంపై ఉమ్మడి అధ్యయనం కుదరదు : తెలంగాణకు తేల్చిచెప్పిన ఏపీ
పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాల్సిందిగా కోరుతున్నారని.. నగరంలో ఇందుకు సంబంధించి భవనాన్ని వెతుకుతున్నట్లు శశిభూషణ్ వెల్లడించారు. వర్కింగ్ సీజన్‌లో పనులకు ప్రణాళిక వేసి ఈ సమావేశంలో ఆమోదించామని ఆయన పేర్కొన్నారు. జనవరి నాటికి దిగువ కాఫర్ డ్యాం పనులను పూర్తి చేస్తామని శశిభూషణ్ చెప్పారు. 2023 జూన్ నాటికి ప్రధాన డ్యాం పనులను గ్రౌండ్ లెవల్‌కు తీసుకొస్తామని ఆయన తెలిపారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి ప్రధాన డ్యాం గ్యాప్ పనులను పూర్తి చేస్తామన్నారు.
