ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలలో కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వెబ్ కాస్టింగ్ లేదా సీసీ కెమెరాలు లేదా వీడియో గ్రఫీ తీసే ఏర్పాట్లు తప్పక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

రికార్డ్ చేసిన వీడియో దృశ్యాలను భద్రపరచాలని స్పష్టం చేసింది. నిష్పక్ష పాతం, పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.