ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై అచ్చెన్నాయుడు
ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీస్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్నికలను బహిష్కరించాల్సిన పరిస్థితులను కూడ ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అమరావతి: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసిందని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం నాడు స్పందించారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
also read:ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాలు: చంద్రబాబు ఇలాకా కుప్పంలో వైసీపీ పాగా
ఈ ఎన్నికల ఫలితాలు బోగస్ ఫలితాలని ఆయన చెప్పారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరుతో తాము ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరుగుతుంది. ఈ ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్ధులు విజయపథంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు ఒక్క స్థానం కూడ దక్కకుండా అధికార పార్టీ అభ్యర్ధులు విజయం సాధించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.