2020-21 సంవత్సరానికి కాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు.  ఈ బడ్జెట్ లో అందరూ ఊహించినట్టే సంక్షేమానికి పెద్దపీటవేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దాదాపుగా 21 సంక్షేమపథకాలకు సంబంధించిన కేటాయింపులను చేసారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. 

నేడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ వర్చ్యువల్ కాన్ఫరెన్సింగ్ ద్వారా తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఇటు శాసనసభలో, అటు మండలిలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంద్వారా వీక్షించారు. 

గతంలో మూడు రాజధానుల విషయంలో మండలిలో టీడీపీ బిల్లును అడ్డుకుంది అన్న కోపంతో జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం పాస్ చేసారు. కానీ రద్దు చేసే అధికారం పార్లమెంటు చేతిలో ఉండడంతో... జగన్ కోరిక ఇప్పుడు నరేంద్రమోడీ అమిత్ షాల దయ మీద ఆధారపడి ఉంది. 

మరొకసారి ఈ సీఆర్డీఏ రద్దు బిల్లును అధికార పక్షం ఈ బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. గవర్నర్ కూడా తన ప్రసంగంలో ఈ ప్రస్తావనను తీసుకువచ్చారు. పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 

జులై 7వ తేదీన శాసనమండలిలో డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామాతో ఖాళీయైన మండలి పోస్టుకు ఎన్నిక కూడా జరగనుంది. వైసీపీ ఆ స్థానాన్ని దక్కిందుకోనుందివో. అందులో సంశయమే లేదు. అయితే మండలిని రద్దుచేయాలని తీర్మానం చేసిన జగన్ ఇప్పుడు మండలిలో తమ అభ్యర్థిని నిలబెట్టడం, ప్రతి బిల్లును కూడా మండలికి పంపిస్తుండడం ఒకింత చూసేవారికి మాత్రం వింతగానే అనిపిస్తుండొచ్చు.