Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు : ఫస్ట్, సెకండియర్‌ షెడ్యూల్ ఇదే..!!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది.

ap inter exams schedule released ksp
Author
Amaravathi, First Published Feb 1, 2021, 9:15 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. 

మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది. కరోనా వ్యాప్తి కాకుండా ఇంటర్మీడియట్‌ బోర్డు చర్యలు తీసుకోనుంది.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించడమే కాకుండా ఇంటర్ మొదటి ఏడాది పనిదినాలు 108కి కుదించారు.

ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి తరగతులు గతనెల 18వ తేదీన ప్రారంభమైన తరగతులు మే 4 వరకు కొనసాగుతాయి. పరీక్షలన్నీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.

మొదటి సంవత్సరం

తేదీ                   పరీక్ష
5             సెకండ్ లాంగ్వేజ్
7             ఆంగ్లం
10           గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం
12           గణితం పేపర్ 1బీ, జీవశాస్త్రం, చరిత్ర
15           భౌతికశాస్త్రం, అర్ధశాస్త్రం
18           రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
20           పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్‌
22           మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ

రెండో సంవత్సరం

తేదీ                  పరీక్ష
6            సెకండ్ లాంగ్వేజ్
8            ఆంగ్లం
11          గణితం పేపర్ 2ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం
13          గణితం పేపర్ 2బీ, జువాలజీ, చరిత్ర
17          భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం
19          రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
21         పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మేథ్స్‌
23         మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ

 

Follow Us:
Download App:
  • android
  • ios