మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం: ఏపీ హోం మంత్రి తానేటి వనిత
మహిళల భద్రత విసయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.
అమరావతి:మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని హోం మంత్రి వనిత వివరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి Taneti Vanitha వనిత గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.
Womenపై జరిగిన దాడులు, దౌర్జన్యాల ఘటనలను గతంలో ఎన్నడూ లేనంత వేగంగా దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి వనిత చెప్పారు.మహిళల భద్రత కోసమే Disha చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దిశ యాప్ ద్వారా 900 మంది మహిళలు, యువతులు Police సహాయంతో తమను తాము రక్షించుకొన్నారని ఆమె తెలిపారు. దిశ చట్టం మంచి ఉద్దేశ్యంతో తీసుకొచ్చినప్పటికీ ఈ చట్టం అమలు చేయాలంటే కేంద్ర సహకరించాల్సిన పరిస్థితులున్నాయని మంత్రి వివరించారు.
ఇటీవల కాలంలో ఏపీ రాష్ట్రంలో మహిళలపై దాడులు, గ్యాంగ్ రేప్ లు, అత్యాచారాలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకు పడ్డాయి. అయితే మహిళలపై దాడులు, దౌర్జన్యాల్లో ఎక్కువగా టీడీపీ వాళ్లే ఉన్నారని హోం మంత్రి వనిత విమర్శలు చేశారు.
గత మాసంలో ఏపీలో మహిళలపై అత్యాచారాలపై విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు.
ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.
ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.