గుంటూరు: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైద్య పరీక్షల నివేదిక ఆలస్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆమెకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. 

 ఇప్పటికే రఘురామకృష్ణంరాజును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలనే తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదనే విషయమై ఏపీ హైకోర్టు  జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జ్యూడిసీయల్ రిజిస్ట్రార్‌కి ఏపీ హైకోర్టు గత బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా కూడ సాయంత్రం ఆరు గంటల వరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

read more  ఆర్మీ ఆస్పత్రి కమాండర్ కు రఘురామ లేఖ: గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు

ఇదిలావుంటే సుప్రీంకోర్టులో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సీఐడి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. రఘురామ చేసిన ప్రకటనలు వీడియో ద్వారా తెలిశాయి కాబట్టి కస్టడీకి అవసరం లేదని చెప్పింది. ఏడాది క్షుణ్నంగా పరిశీలించి, దర్యాప్తు చేసిన తర్వాతనే కేసు నమోదు చేశామని సిఐడి చెప్పింది కాబట్టి కూడా కస్టడీ అవసరం లేదని చెప్పింది.