ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద... ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను, నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని సూచించింది.

Also Read:ఇండస్ట్రీకి కింగ్‌వి కాదు.. హీరోవే, మూసుకుని కూర్చోలేం: బాలయ్యకు నాగబాబు వార్నింగ్

ఏపీలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోవడం, ఆంక్షలను ఉల్లంఘించడం దాఖలైన ఫిర్యాదులపై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది.

వైసీపీకి చెందిన ఓ మంత్రితోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో మొత్తం ఎనిమిది వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌లకు కోర్టు సూచించింది.

Also Read:కమీషన్లకు వైన్..దందాలకు మైన్, జగన్‌ది కరెప్షన్ బ్లడ్ గ్రూప్: మహానాడులో లోకేశ్

ఫిర్యాదు తీసుకుని తద్వారా వారి మీద చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై కిశోర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.