ఏపీ సర్కార్‌పై హైకోర్టు సీరియస్: అలా అయితే కోర్టుకు రావాల్సిందే


 ఉపాధి హామీ పథకం కింద బకాయిలను ఆగష్టు 1వ తేదీలోపుగా చెల్లించకపోతే ఉన్నతాధికారులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది హైకోర్టు.ఈ విషయమై పలుమార్లు ఆదేశాలిచ్చినా కూడ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. 

AP High court serious comments on AP government lns

అమరావతి: ఉపాధి హామీ పథకం బకాయిలను ఈ ఏడాది ఆగష్టు 1వ తేదీలోపుగా చెల్లించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే ఏపీ పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు  కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.ఉపాధి హామీ బకాయిలను చెల్లించాలని  ఆదేశాలు జారీ చేసినా ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది. చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఎదుట ఉపాధి హామీ  నిధులపై విచారణ చేపట్టారు. 

వివిధ పిటిషన్లను కలిపి హైకోర్టు ధర్మాసనం  గురువారం నాడు విచారించింది. సీఎస్‌ ఆథిత్యనాథ్‌ను కూడా పిలిపించాలని హైకోర్టు తొలుత భావించింది. నిధులు వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఆగస్టు 1వ తేదీలోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సుమారు రూ. 2,500 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  కోర్టుకు హామీ ఇచ్చిన ప్రకారంగా బకాయిలు చెల్లిస్తారో లేదోననే సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios