జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ : సినీ టికెట్ ధరలపై కీలక ప్రకటన

వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. మూవీ టికెట్ల రేట్లను సవరిస్తూ తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం లేదంటూ తేల్చి చెప్పింది. 

AP High court Key announcement on movie ticket prices

అమరావతి : movie ticket pricesను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని.. Licensing Authority(జేసీ)కి అభిప్రాయమే తెలియజేయగలదని High Court ప్రాథమికంగా అభిప్రాయపడింది. అంతిమంగా ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథారిటీయేనని స్పష్టం చేసింది. గత GOల ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ టిక్కెట్ ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేసింది. ఈ వ్యవహారం మొత్తాన్నీ లోతుగా చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఆన్లైన్ సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీస్ ఛార్జీలను ధరల్లో కలవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను నిర్ణయించుకోవచ్చు అని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు తెలిపింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రేక్షకులకు సర్వీస్ ఛార్జీలు విధించుకుని వెసులుబాటును యాజమాన్యాలకు కల్పించింది.

ఆన్లైన్ టికెట్ విక్రయాలపై సందేహాలు, నిధుల దుర్వినియోగం, మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన అక్కర్లేదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేశారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ ల టిక్కెట్ ధరల్లోనే సర్వీసు చార్జీలను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో ఇచ్చింది.  దీనిని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరఫున ఫరీద్ బిన్ అవధ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘సినిమా టికెట్ ధరలు నిర్ణయించేందుకు గతేడాది డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలను భాగస్వాములను చేయలేదు. కనీసం వారిని సంప్రదించలేదు.  సింగిల్ స్క్రీన్ థియేటర్ లతో పోల్చితే మల్టీప్లెక్స్ ల వ్యవస్థ పెద్దది.  

విస్తృత సౌకర్యాలు కల్పిస్తాయి. అలాంటప్పుడు ప్రభుత్వం..  యాజమాన్యాలను సంప్రదించకుండా..  వారు అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయానికి రావడానికి వీల్లేదు. థియేటర్ యాజమాన్యాలు  ప్రేక్షకులకు  ఆన్లైన్ బుకింగ్ కల్పిస్తున్నాయి. లైన్ లో నిలబడే పని లేకుండా ఎక్కడినుంచైనా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు అందిస్తున్నాయి. విమాన, రైలు టికెట్ లతోపాటు ఆహార సరఫరా సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నందుకు సర్వీస్ ఛార్జీలు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ సర్వీస్ ఛార్జీలను సినిమా టికెట్ ధర లో చేర్చడం సరికాదు. హాలులో ప్రవేశించడానికి విధించేదే అసలు ధర అవుతుంది.  అంతే తప్ప ఆన్లైన్ బుకింగ్, సర్వీస్ చార్జి టికెట్ ధరలో పొందుపరచడానికి వీల్లేదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios