Asianet News TeluguAsianet News Telugu

బిల్డ్ పిటిషన్ పై విచారణ:ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

మిషన్ బిల్డ్  పిటిషన్ పై తాను విచారణ కొనసాగించాలో విచారణ నుండి తప్పుకోవాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు.
 

AP High court justice Rakesh kumar interesting comments on ap build petition lns
Author
Amaravathi, First Published Dec 21, 2020, 3:04 PM IST


అమరావతి: మిషన్ బిల్డ్  పిటిషన్ పై తాను విచారణ కొనసాగించాలో విచారణ నుండి తప్పుకోవాలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు.

మిషన్ బిల్డ్ పై  దాఖలైన పిటిషన్ పై విచారణ నుండి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ విషయమై జస్టిస్ రాకేష్ కుమార్ స్పందించారు.

ఈ పిటిషన్ పై తాను విచారణ చేయాలో వద్దో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.

రాగద్వేషాలకు అతీతంగా వ్యవస్థ కోసం తాను పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 28న విచారణ చేస్తానని ఆయన చెప్పారు. తన కెరీర్ చివర్లో ఇలాంటి పిటిషన్ చూస్తాననుకోలేదన్నారు.

మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో ప్రభుత్వ భూములను విక్రయించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విచారణ నుండి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

రాష్ట్రంలోని గుంటూరు, విశాఖపట్టణంతో పాటు 9  ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

జస్టిస్ రాకేష్ కుమార్ విచారణ నుండి తప్పుకోవాలని  మిషన్ ఆఫ్ ఏపీ ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios