అమరావతి: మెంటల్ ఆసుపత్రి సూపరింటెండ్ అనమతితో డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ కావొచ్చని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ప్రకటించింది.

డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు తీర్పు చెప్పింది.డాక్టర్ సుధాకర్ సీబీఐ విచారణకు సహకరించాలని కూడ హైకోర్టు స్పష్టం చేసింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత డాక్టర్ సుధాకర్ ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

also read:డాక్టర్ సుధాకర్ కేసులో కొత్త ట్విస్ట్: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన తల్లి

గత నెల 16వ తేదీన విశాఖపట్టణంలో నడిరోడ్డుపై అర్ధనగ్నంగా డాక్టర్ సుధాకర్ ప్రత్యక్షమయ్యాడు. మద్యం మత్తులో సుధాకర్ రోడ్డుపై రభస సృష్టించారని పోలీసులు పేర్కొన్నారు

also read:ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్ .

డాక్టర్ సుధాకర్ ను ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయనపై దాడి చేశారనే నెపంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.ఈ విషయమై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిత దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ విచారణకు ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ విషయమై సీబీఐ విచారణను చేపట్టింది.