చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో షాక్..ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్..
చంద్రబాబు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మూడు కేసుల్లో పెట్టుకున్న పిటిషన్లను తోసి పుచ్చింది.

అమరావతి : ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి చుక్కెదురయ్యింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. అంగళ్లు, ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరాకరిస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది.
చంద్రబాబునాయుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయడానికి అర్హత లేదని చెబుతూ ఏపీ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది. మూడు కేసుల్లో బెయిల్ పిటిషన్లు వేయగా.. ఇందులో ఒక్కకేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.