పుంగనూరు అంగళ్లు ఘర్షణ: దేవినేని సహా పలువురు టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పై విచారణ రేపటికి వాయిదా

పుంగనూరు అసెంబ్లీ నియోజకర్గంలోని  అంగళ్లులో  టీడీపీ, వైసీపీ ఘర్షణలకు సంబంధించి  టీడీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను  ఏపీ హైకోర్టు  రేపటికి వాయిదా వేసింది.

AP High Court Adjourns  TDP Leaders  anticipatory  Bail Petitions in Angallu Incident lns

అమరావతి: పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అంగళ్లులో  టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నేతలు  దాఖలు చేసిన  ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు.టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాని  ముందస్తు బెయిల్ పిటిషన్లపై  ఏపీ హైకోర్టు విచారణను  రేపటికి వాయిదా వేసింది. 

ఈ నెల  5న అంగళ్లులో టీడీపీ, వైసీపీ  మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది. ఈ ఘర్షణకు సంబంధించి  చంద్రబాబు సహా  పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.  దీంతో  దేవినేని ఉమ, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలు  ముందస్తు బెయిల్  పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణను  హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో  ఇప్పటికే  పలువురిని అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై  తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. తనపై హత్యాయత్నం చేసి తనపై కేసు నమోదు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. అంగళ్లు ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేలాలని చంద్రబాబు డిమాండ్  చేశారు. ఈ విషయమై అన్ని రకాల పోరాటాలు  చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

also read:ఎందుకు ఈ రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి: పుంగనూరు ఘర్షణలపై బాబుపై జగన్ ఫైర్

సాగు నీటి ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా చంద్రబాబునాయుడు పుంగనూరు నియోజకవర్గంలో  పర్యటనకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.   అనుమతి తీసుకున్న రూట్ లో కాకుండా  మరో రూట్ లో  చంద్రబాబు వచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు.  అయితే  చంద్రబాబు వెళ్లే రూట్ లో  వైసీపీ శ్రేణులు  లారీలను అడ్డు పెట్టడంపై   తమ పార్టీ  కార్యకర్తలు నిరసనకు దిగినట్టుగా టీడీపీ ప్రకటించింది. ఈ సమయంలో పోలీసులు  చోద్యం చేశారని ఆ పార్టీ  ప్రకటించింది. అయితే  పోలీసులపై  చంద్రబాబు  చేసిన వ్యాఖ్యలను  వైసీపీ నేతలు తప్పుబట్టారు.  పోలీసులు సంయమనంతో వ్యవహరించారని  జిల్లా ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios