ఇసుక అక్రమాల కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇసుక అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది . ఈ కేసులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ 4గా దేవినేని ఉమా వున్నారు.

ఇసుక అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది. ఈ నెల 20 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది ధర్మాసనం. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక స్కాంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ 4గా దేవినేని ఉమా వున్నారు.
కాగా.. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా వుంచాలని, న్యాయ విచారణలో తలమునకలై వుండేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై తాను , మిగిలిన విపక్ష నేతలు గళమెత్తుతున్నామని.. తమ నోళ్లు మూయించాలనే ఉద్దేశంతోనే వేధిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.