అంగళ్లు ఘటన.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా..
అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రతివాదులుగా ఉన్న ముదివేడు పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో, అన్నమయ్య జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను నేటికి (సెప్టెంబర్ 20)కి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారిని(సెప్టెంబర్ 22) వాయిదా వేసింది. రేపు పూర్తి స్థాయిలో వాదనలు వింటామని తెలిపింది.
ఇక, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబుపై ఉన్న పలు కేసుల్లో పోలీసులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంగళ్ల ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు ఉండటంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.