జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు: ఏపీ హైకోర్టు
జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
2020 లో సివిల్ జడ్జి పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసినవారే అర్హులని ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అయితే నిబంధనలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ 2020లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలిచ్చింది. ఈ నోటిఫికేషన్ స్థానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరింది.