Asianet News TeluguAsianet News Telugu

త్వరలో రాష్ట్రంలో మటన్ మార్ట్‌లు.. ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన, తొలి దశలో 112 ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మటన్ మార్ట్ లు రానున్నాయి.  తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ విజయవంతం అయితే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారు. రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

ap govt will set up mutton mart to provide quality mutton
Author
Amaravati, First Published Sep 9, 2021, 4:44 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మటన్ మార్ట్ లు రానున్నాయి.  ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మాంసం మార్టులకు రూపకల్పన చేయనుంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ విజయవంతం అయితే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారు. రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

మాంసం తినేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇదే సమయంలో కల్తీమాంసం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రజల ఆరోగ్యానికి  హాని జరుగుతుంది. ఇక మరోవైపు వైద్యులు కూడా మాంసాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రోటీన్ అధికంగా మాంసంలోనే లభిస్తుందని, శరీరానికి సరైన ప్రోటీన్ అందితే కండరాలు బలంగా తయారవుతాయని అంటున్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్‌లో మటన్ దుకాణాల ప్రమాణ స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య కరమైన పరిస్థితుల్లో ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చడానికి మటన్‌ దుకాణాలు అందుబాటులోకి తేనుంది. మటన్ మార్ట్‌గా పిలిచే ఈ మొబైల్ దుకాణం వాహనమే. పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 మేకలు, గొర్రెలను మటన్‌గా మార్చే ఏర్పాట్లు అందులో ఉంటాయి. కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్‌ విక్రయాలు జరిపేందుకు వీలుగా ఆ వాహనాన్ని డిజైన్ చేస్తారు. ప్రాసెసింగ్‌ చేసిన మాంసాన్ని నిల్వ చేసేందుకు రిఫ్రిజరేటర్లు ఇతర ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios