Asianet News TeluguAsianet News Telugu

అమెరికాకు పరార్: చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. 

ap govt suspends chandrababu naidu EX personal assistant Pendyala Srinivas ksm
Author
First Published Sep 30, 2023, 11:20 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని ప్రభుత్వం శ్రీనివాస్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసశారు. ఇక, శ్రీనివాస్.. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో కూడా శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయనేది సీఐడీ ఆరోపించిన సంగతి  తెలిసిందే. 

అయితే శ్రీనివాస్ ప్రస్తుతం అమెరికాకు పరారైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రణాళిక శాఖ.. పెండ్యాల శ్రీనివాస్‌కు మెమో జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయితే దీనిపై పెండ్యాల శ్రీనివాస్ స్పందించకపోవడంతో.. అతనిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 

ఇక, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడిస్తున్న సమయంలో ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. ఈ డీల్‌ వెనుక డిజైన్‌ టెక్‌ సూత్రధారి అని అన్నారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్న డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ విదేశాలకు పారిపోయాడని చెప్పారు. పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికాకు పారిపోయాడని తెలిపారు. ఈ కుంభకోణంలో నిందితులు కీలక పాత్రధారులు కావడంతో వారిని తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటామని కూడా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios