విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా గతంలో విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విశాఖలో వున్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కేటాయించిన రూ.13.80 కోట్లు విశాఖలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్‌కు బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.