చంద్రబాబుకు రిమాండ్.. ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తికి భద్రత పెంపు , ఏపీ సర్కార్ నిర్ణయం
విజయవాడ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లను ఆమె విచారిస్తున్నారు.

విజయవాడ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లను ఆమె విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హిమబిందు భద్రతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆమెకు 4+1 ఎస్కార్ట్‌తో భద్రత కల్పించింది.
అంతకుముందు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ వాదనలతో ఏసీబీ కోర్ట్ ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణనలోనికి తీసుకోలేదు.