ఇళ్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించింది.

కోర్టు స్టే వున్న ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సర్కార్ తెలిపింది. డీ-ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయించనుంది ప్రభుత్వం. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టి.. తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.