Asianet News TeluguAsianet News Telugu

టిడ్కో ఇళ్ల పంపిణీ: ఆ తహసీల్దార్లు ఇక జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు

రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్‌లకు సర్కార్ చర్యలు చేపట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల తహసీల్దార్‌లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ap govt key decision for tidco houses distributions ksp
Author
Amaravathi, First Published Dec 16, 2020, 4:23 PM IST

రాజధాని పరిధిలో పేదలకు ఇచ్చే టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్‌లకు సర్కార్ చర్యలు చేపట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల తహసీల్దార్‌లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాజధాని అమరావతి పరిధిలో అర్బన్ తహసీల్దార్లు లేకపోవడంతో ఆయా మండలాల తహసీల్దార్లనే టిడ్కో ఇళ్ల కోసం జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణించింది ప్రభుత్వం.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్‌ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని సీఎం స్పష్టం చేశారు
 

Follow Us:
Download App:
  • android
  • ios