ఏపీ : ఆన్‌లైన్ మూవీ టికెట్లపై జీవో విడుదల..పేటీఎం, బుక్ మై షోలకు ఇక చెక్

ఆన్‌లైన్ సినిమా టికెట్లపై (online movie tickets) జీవో నెం. 142ని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. సినిమా టికెట్ల పంపిణీని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. బుక్ మై షో, పేటీఎం లాంటి ఆన్‌లైన్ యాప్స్‌కి ఈ జీవోతో చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.

ap govt issued go no 142 for online movie tickets

ఆన్‌లైన్ సినిమా టికెట్లపై (online movie tickets) జీవో నెం. 142ని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. సినిమా టికెట్ల పంపిణీని ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. బుక్ మై షో, పేటీఎం లాంటి ఆన్‌లైన్ యాప్స్‌కి ఈ జీవోతో చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్.. (ap film development corporation) సినిమాను బట్టి టికెట్ రేటును నిర్ణయిస్తుందని జీవోల పేర్కొంది. థియేటర్స్ మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన అడ్మిషన్ రేట్స్‌ ప్రకారం ... ట్యాక్స్ మినహాయించుకుని , మిగిలిన మొత్తాన్ని ఆయా థియేటర్స్ ఖాతాలకు జమ చేస్తామని తెలిపింది. ఈ విధానానికి ఏపీ ఫిలిం ఛాంబర్ (ap film chamber of commerce ) అంగీకరించినట్లు జీవోలో తెలిపింది ఏపీ సర్కార్. 

మరోవైపు సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని ఆయనే నిర్ణయం తీసుకొంటారని ఏపీ హైకోర్టు సూచించింది. ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది హైకోర్టు.

Also Read:జీవో నెం. 35 అమల్లోనే వుంది.. రద్దయ్యింది ఈ థియేటర్లకే: సినిమా టికెట్ రేట్లపై ఏపీ హోంశాఖ క్లారిటీ

ఇటీవల  జరిగిన  Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే సినిమా Tickets అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసింది.టికెట్ ధరలను తగ్గించింది. అయితే టికెట్ల ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు.కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. 

టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను  ఇష్టారీతిలో  పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొచ్చేందుకు వీలుగా సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగానే సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశామని ప్రభుత్వం  తెలిపింది.
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios