Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్ఆర్ఏ పెంపు, జీవో జారీ

ఏపీలో హెచ్‌వోడీ కార్యాలయాల్లో (hod offices) ఉద్యోగుల హెచ్ఆర్ఏపై (hra) జీవో జారీ చేసింది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం (ap govt) . అయితే ఇది రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ చెందిన పెంపు కాదని తెలుస్తోంది.

ap govt hikes hra for hod employees
Author
Amaravathi, First Published Jan 29, 2022, 6:45 PM IST

ఏపీలో హెచ్‌వోడీ కార్యాలయాల్లో (hod offices) ఉద్యోగుల హెచ్ఆర్ఏపై (hra) జీవో జారీ చేసింది ప్రభుత్వం. హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం (ap govt) . అయితే ఇది రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ చెందిన పెంపు కాదని తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ (hyderabad) నుంచి అమరావతికి (amaravathi) తరలివచ్చిన సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల సిబ్బందికి మొన్నటి వరకు 30 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేవారు. అయితే తాజా పీఆర్సీలో 8 శాతం మాత్రమే హెచ్ఆర్ఏ ఇవ్వాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సదరు హెచ్‌వోడీ కార్యాలయాలు విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో వుండటంతో వీరికి 8 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేస్తున్నారు. అయితే వీరికి 16 శాతం హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios