Asianet News TeluguAsianet News Telugu

ఇకపై చదువు ఒక్కటే పని.. టీచర్లకు ఇతర విధులు బంద్ : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని ఉపాధ్యాయేతర విధుల నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు

ap govt good news for teachers union
Author
First Published Nov 29, 2022, 5:54 PM IST

ఉపాధ్యాయుల విధులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఉపాధ్యాయేతర విధుల నుంచి టీచర్లకు మినహాయింపునిచ్చింది. దశాబ్ధాలుగా ఉపాధ్యాయులు చేస్తున్న ఎన్నికల విధులు, జనగణన వంటి విధుల నుంచి వారిని తప్పించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు వర్చువల్‌గా సంతకాలు చేశారు. తమను విద్యాయేతర విధుల నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్ధుల చదువుపై దృష్టి కేంద్రీకరించనున్నారు. 

Also REad:ఇకపై హైస్కూల్ విద్యార్ధులకూ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఇకపోతే.. హైస్కూల్ విద్యార్ధుల అటెండెన్స్ విషయంలో కీలక మార్పులు తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యార్ధులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించింది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నెలాఖరు లోగా విద్యార్ధులందరిని యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తోంది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లోనూ ఇదే తరహాలో అటెండెన్స్ తీసుకోనున్నారు. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జియో ట్యాగింగ్ సాంకేతికత ద్వారా ఆయా కాలేజీల్లో మాత్రమే యాప్ పనిచేసే విధంగా యాప్ డిజైన్ చేసింది ప్రభుత్వం. కేవలం రెండు నిమిషాల్లోనే విద్యార్ధుల హాజరు నమోదు చేసేలా యాప్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios