Asianet News TeluguAsianet News Telugu

ఏపీ : కర్ఫ్యూ వేళల్లో మార్పులేమీ లేవని సింఘాల్ స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పగటిపూట లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 20శాతానికి పైగా ఉంది. ఇది 10శాతానికి చేరితేనే లాక్ డౌన్ విధించాల్సి వుంటుంది

ap govt change curfew timings amid covid out break ksp
Author
Amaravathi, First Published May 18, 2021, 3:55 PM IST

ఆంధ్రఫ్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల్లో ఏ విధమైన మార్పులు లేవని ఉన్నతాధికారి సింఘాలు స్పష్టం చేశారు. కర్ఫ్యూ వేళల్లో మార్పులు ఉంటాయని జరిగిన ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ స్పష్టత ఇచ్చారు.

అంతకు ముందు ఇలా వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పగటిపూట లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 20శాతానికి పైగా ఉంది. ఇది 10శాతానికి చేరితేనే లాక్ డౌన్ విధించాల్సి వుంటుంది.. అలాంటిది 20 శాతానికి పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాలు సమయం ఉండాలని సీఎం జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Also Read:పశ్చిమగోదావరిలో 16 మంది మృతి: ఏపీలో కరోనా విజృంభణ, మృత్యుఘంటికలు

మరోవైపు మే 20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 12 వరకు ఉన్న సడలింపులను ఎల్లుండి నుంచి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో  నిజం లేదని సింఘాల్ చెపపారు. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2 వ స్థానం లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios