ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ఏపీ సీఎస్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలు పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మీడియాకు వివరించారు. 

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం నివేదిక కోరలేదని ఏపీ సీఎస్ తెలిపారు. బలవంతపు మత మార్పిడులుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని ఆదిత్యనాథ్ వెల్లడించారు.

దేవాలయాల ఘటనపై ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సీఎం, హోంమంత్రి, డీజీపీకి మతాలను ఆపాదించడం సరికాదని సీఎస్ చెప్పారు.