Asianet News TeluguAsianet News Telugu

కరోనా నుంచి కోలుకుని బెజవాడ చేరుకున్న గవర్నర్ ... కోవిడ్ విషయంలో అశ్రద్ధ వద్దని హితవు

కరోనా (coronavirus) నుండి కోలుకుని విజయవాడ (vijayawada ) చేరుకున్నారు ఏపీ గవర్నర్ (ap governor) బిశ్వభూషణ్ హరిచందన్.  రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ అన్నారు. సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం ఎంతో మేలు చేసిందని గవర్నర్ హరిచందన్  అన్నారు. కోవిడ్ ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ద పనికిరాదని హరిచందన్ ప్రజలకు సూచించారు. 

ap governor discharged from aig hospital hyderabad
Author
Amaravati, First Published Nov 23, 2021, 4:23 PM IST

కరోనా (coronavirus) నుండి కోలుకుని విజయవాడ (vijayawada ) చేరుకున్నారు ఏపీ గవర్నర్ (ap governor) బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhusan harichandan) . ఈ సందర్భంగా ‌రాజ్‌భవన్‌లో గవర్నర్ కు స్వాగతం పలికారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా (rp sisodia ias) . అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ అన్నారు. సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం ఎంతో మేలు చేసిందని గవర్నర్ హరిచందన్  అన్నారు. కోవిడ్ ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ద పనికిరాదని హరిచందన్ ప్రజలకు సూచించారు. 

ALso Read:ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కి కరోనా: హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స

కరోనా పాజిటి‌వ్‌‌గా తేలడంతో గవర్నర్ హరిచందన్ నవంబర్ 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో (aig hospital) చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) వైద్యులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అటు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (venkaiah naidu), తెలంగాణ గవర్నర్ తమిళసై (tamilisai soundararajan) ఆయనను పరామర్శించారు. అయితే.. వైద్య చికిత్సల అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios