శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి:కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీకి మంగళవారం నాడు లేఖ రాశాడు. ఎగువన నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరింది ఏపీ సర్కార్.
అమరావతి: శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం అనుమతించాలని ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది.
ఎగువన కురిసన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు మూడు రోజుల్లో భారీ వరద వచ్చే అవకాశం ఉందని ఏపీ ఇరిగేషన్ అధికారులు అబిప్రాయపడుతున్నారు. దీంతో శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఆ లేఖలో కేఆర్ఎంబీని కోరారు.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని ఏపీ ప్రభుత్వం గతంలో అభ్యంతరం తెలిపింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో వృధాగా నీరు సముద్రంలో కలుస్తోందని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ ఏ రకంగా వ్యవహరిస్తోందోననేది ఆసక్తిగా మారింది.