సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు: జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి
సినీ రంగ సమస్యలకు పరిష్కారం దొరికిందని ప్రముఖ సీనీ నటుడు చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ తో భేటీ ముగిసిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు.
అమరావతి: Tollywood సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని ప్రముఖ Cine నటుడు చిరంజీవి చెప్పారు. ఏపీ సీఎం YS Jaganతో సమావేశం ముగిసిన తర్వాత సినీ నటుడు Chiranjeevi గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
సినీ పరిశ్రమ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ బాగోగులు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అన్ని వర్గాల సంతృప్తి కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టాలీవుడ్ సినిమాలు దేశంలోనే పేరుగాంచాయని ఆయన గుర్తు చేశారు.
చిన్న సినిమాలు ఐదవ షోకి కూడా ప్రభుత్వం అంగీకరించిందని చిరంజీవి చెప్పారు. ప్రజలు, సినీ పరిశ్రమ కూడా సీఎం జగన్ తీసుకొన్న నిర్ణయం పట్ల సంతృప్తి చెందుతారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ధరలపై కొన్ని నెలలుగా ఉన్న అనిశ్చిత పరిస్థితులకు శుభం కార్డు పడిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చిరంజీవి చెప్పారు. చిన్న సినిమాలకు కూడా మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. చర్చలకు మమ్మల్ని ఆహ్వానించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. పాన్ ఇండియా సినిమాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సీఎం చెప్పారని చిరంజీవి వివరించారు.
సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వంతో చర్చలను నిర్వహించిన చిరంజీవికి తొలుత ధన్యవాదాలు చెబుతున్నానని ప్రముఖ నటుడు మహేష్ బాబు చెప్పారు. ఈ చర్చలతో తమందరికీ ఓ దారి చూపారని Mahesh Babu తెలిపారు.ఆరేడు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉందని చెప్పారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో సినీ పరిశ్రమకు పెద్ద రిలీఫ్ అని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.చిరంజీవితో పాటు ఈ విషయమై ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని కూడా చొరవ చూపారని మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో అందరూ శుభవార్త వింటారని మహేష్ బాబు చెప్పారు.
చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు నిర్మాతల సమస్యలను సీఎం జగన్ ఓపికగా విన్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చెప్పారు. సినిమా పరిశ్రమ ఎలా ముందుుకు వెళ్లాలనే దానిపై సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని Rajamouli చెప్పారు. .సినీ పరిశ్రమ సమస్యలపై ఎటు వెళ్లాలనే దానిపై ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసినప్పటికీ చిరంజీవి ఈ అంశాన్ని తన భుజానికెత్తుకొని సక్సెస్ అయ్యేలా చేశారన్నారు.సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని సినీ నటుడు ప్రభాష్ చెప్పారు.ఈ విషయమై చొరవ చూపిన చిరంజీవి, మంత్రి పేర్ని నానిలకు Prabhas ధన్యవాదాలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి చొరవతో సినీ పరిశ్రమ గందరగోళం నుండి బయటపడే మార్గం దొరికిందని ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్. Narayana Murthyచెప్పారు. నంది అవార్డుల గురించి కూడా సీఎం వద్ద ప్రస్తావించామన్నారు. చిన్న సినిమాల మనుగడ కష్టంగా మారిందని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు థియేటర్లను అడుక్కొనే పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని తాము సీఎంను కోరామన్నారు.
ఇవాళ సీఎం వద్ద జరిగిన సమావేశంలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ఈ నెలాఖరులోపుగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయనుందని ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సినీ పరిశ్రమ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఫిల్మ్ ఛాంబరే తమకు తొలి ప్రాధాన్యతగా మంత్రి నాని చెప్పారు. ఛాంబర్ సిఫారసు చేసిన మేరకు టికెట్ ధరల విషయంలో సభ్యులను ఎంపిక చేశామన్నారు మంత్రి Perni Nani.చిన్న సినిమాల గురించి ఏం చేయాలనే దానిపై తమలో తాము మాట్లాడుకొని చెబుతామని చిరంజీవి సహా సినీ ప్రముఖులు సీఎంకు హామీ ఇచ్చారన్నారు. సినిమా షూటింగ్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేందుకు ఏం కావాలో చెప్పాలని సీఎం కోరారన్నారు. ఏపీలో కూడా షూటింగ్ లు నిర్వహించేందుకు సినీ పరిశ్రమ అంగీకరించిందన్నారు. స్టూడియోల నిర్మాణంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.నెలాఖరులోగా అన్ని సమస్యలపై పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుందన్నారు.