గుడ్‌న్యూస్:ఈ నెల 16‌ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు

 ఏపీలో ఈ నెల 16 నుండి ఇంటర్ సెకండియర్  విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే గత నెల 12వ తేదీ నుండి ఆన్‌లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

AP government plans to conduct inter second year classes from August 16 lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఇప్పటికే గత నెల 12వ తేదీ నుండి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నారు.  కరోనా నిబంధనలకు అనుగుణంగా సెకండియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఇంటర్ బోర్డును ఆదేశించింది.

ఈ నెల 16వ తేదీ నుండి స్కూల్స్ ను కూడ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విద్యా సంస్థలను పున: ప్రారంభించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.ఆన్‌లైన్ క్లాసుల కంటే భౌతికంగా విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు హాజరై భౌతికంగా క్లాసులు వినడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ  రెగ్యులర్ క్లాసులను నిర్వహించాలని భావిస్తోంది.కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios