నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్: గ్రూప్ -1,2 ద్వారా 597 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టులను భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. గ్రూప్-1 ద్వారా 89 పోస్టులు, గ్రూప్-2 ద్వారా 508 పోస్టులను భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవలనే గ్రూప్ 1 పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల భర్తీకి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూన్ మూడు నుండి 10వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జులై నెలాఖరునాటికి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఆగస్టులోపుగా మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.