Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక .. డీఏ విడుదల చేసిన ఏపీ సర్కార్ , ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక అందించింది. ఈ మేరకు డీఏ విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. 

ap government issued orders for release da for employees ksp
Author
First Published Oct 21, 2023, 9:55 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక అందించింది. ఈ మేరకు డీఏ విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 3.64 శాతం డీఏ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. సర్కార్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆయన సంతకంతో గెజిట్ నోటిఫికేష్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా జీపీఎస్ చట్టానికి సభ ఆమోదం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనుంది ప్రభుత్వం. 

మరోవైపు.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో బిల్లును గెజిట్ నోటిఫికేషన్ రూపంలో ప్రచురించారు. ప్రభుత్వ నిర్ణయంతో పలు శాఖల్లో పనిచేస్తున్న 10,117 మంది  కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios