ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఎస్‌జీటీలుగా ఉద్యోగాలు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఎస్‌జీటీలుగా ఉద్యోగాలు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం.జీవో నెంబర్ 27 జారీ చేసింది. మినిమమ్ టైమ్ స్కేలుతో నియమకాలు చేపట్టనున్నట్టుగా ఉత్తర్వుల్లో విద్యాశాఖ పేర్కొంది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4534 మందికి లబ్ది చేకూరనుంది. వీరిని కౌన్సిలింగ్ ద్వారా కాంట్రాక్టు పద్దతిలో నియమించనున్నారు. నెలాఖరులోగా అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందజేయనుంది.
ఇక, 1998లో డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్ హాక్ ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులను నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది జూన్‌లోనే సూత్రప్రాయంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ-2008 క్వాలిఫైడ్ టీచర్లతో సమానంగా మినిమం టైమ్ స్కేల్ (ఎంటీస్) ఆధారంగా అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా (ఎస్‌జీటీలుగా) నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పాఠశాల విద్యాశాఖ) జారీ చేసిన సర్క్యూలర్ పేర్కొన్నారు.
