ఏబీవీకి జగన్ షాక్: నిఘా పరికరాల కేసు రీ ఓపెన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. 

AP government files petition in High court on AB venkateswararao case

అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు  ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు.  ఈ సమయంలో  నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చేశారని  ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు  ఇవ్వాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే ఈ పిటిషన్ పై  ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును  రిజర్వ్ చేసింది.  

also read:పోలీస్ శాఖపై ఆరోపణలు: ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్

ఈ విషయమై తమ వాదనలను వినాలని  ఏపీ సర్కార్ హైకోర్టును కోరింది. కేసును రీ ఓపెన్ చేయాలని కోరింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై  తన వద్ద కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆ శాఖ అధికారులు స్పందించలేదని  ఆయన రెండు రోజుల క్రితం ఆరోపించారు. ఈ విషయమై ఆయన సీబీఐకి లేఖ రాశారు.  సిట్ దర్యాప్తు తీరును, సీబీఐ తీరును  ఆయన తప్పుబట్టారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios