ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో  లేనట్లేనని సంకేతాలిచ్చింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో 108 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ప్రత్యేకాధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల్లోని మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో మాత్రం ప్రత్యేకాధికారుల పాలనను డిసెంబర్ 31 వరకు లేదా కొత్త పాలక వర్గం ఏర్పాటయ్యేంత వరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కోవిడ్ కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్నందున  దానికి అనుగుణంగానే జగన్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.