అమరావతి ఆర్ 5 జోన్ లో    పేదలకు  తమ ప్రభుత్వం  ఇళ్ల  పట్టాలు  ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నామని  ఏపీ ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. 

అమరావతి:ఆర్ 5 జోన్ లో మోడరన్ టౌన్ లు రాబోతున్నాయని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.ఆర్5 జోన్ లో పనులను శుక్రవారంనాడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ళు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. అమరావతి ఆర్ 5 జోన్ లో కూడా పేదలకు ఇళ్ళు రాబోతున్నాయని ఆయన చెప్పారు. మహా యజ్ఞంలా పనులు సాగుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు..సైందవుల్లా పేదలకు అమరావతిలో స్థానం లేకుండా టీడీపీ ప్లాన్ వేసిందని ఆయన ఆరోపించారు. 

అన్ని వర్గాలు లేని నగరం ఎక్కడా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అన్ని రకాల అడ్డంకులు సృష్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై విమర్శలు చేశారు.రాజధాని రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టులకు వెళ్ళారని ఆయన ఆరోపించారు. అమరావతిలో పేదలు, దళితలకు ఇళ్లు ఉండ కూడదని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఓట్లు అడగాల్సిన పేదలను కూడా తిడుతున్నారన్నారు. ప్రైవేటు లే అవుట్స్ కన్నా మంచిగా లేఅవుట్స్ వేస్తున్నామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి..ఆర్5 జోన్ లోకి వచ్చే పేదలు పాకిస్థాన్ నుండి వచ్చినవారా అని ఆయన ప్రశ్నించారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చట్టం ఉన్నా ధనవంతులకు మాత్రమే అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని టీడీపీ సర్కార్ పై ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలు . దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారన్నారు. జగన్ పేదల గురించే మాట్లాడుతున్నారని తెలిపారు.అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్లు నిర్మించుకొనే పేదలకు బ్యాంక్ లోన్లు వస్తాయన్నారు. . అదేవిధంగా ఇసుక, స్టీల్, సిమెంట్ ప్రభుత్వం ద్వారా అందించనున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.