కోవిడ్ తో అనాథలైన చిన్నారుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..


కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 

ap governament to start child care centres over parents death due to covid 19 - bsb

కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 

కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకూ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించున్నారు.రాష్ట్రంలోని  మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 

ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం పగటిపూట కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత రాకుండా.. ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ తో కూడిన బెడ్స్  ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా రెండు ఏసీ బస్సులను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను తయారు  చేశారు.  

ఆక్సిజన్ కొరత రానీయం.. వ్యాక్సిన్ కొనుగోలుకు రూ.1,600 కోట్లు సిద్ధం: ఆళ్ల నాని...

గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో రైల్వే శాఖ రైల్వే బోగీలను  కరోనా రోగుల కోసం తయారు చేయించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రెండు ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు  చేయించారు. 

ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు బెడ్స్ దొరకని పక్షంలో ఈ బస్సుల్లో ఆక్సిజన్  బెడ్స్ పై రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రతి బస్సులో  సుమారు 12 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు.  రాజమండ్రి ప్రభుత్వాసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని కరోనా రోగులకు  ఈ బస్సుల్లో చికిత్స అందించనున్నారు.  

ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ కాగానే  ఈ బస్సు నుండి రోగులను ఆసుపత్రికి తరలించనున్నారు. జగనన్న ప్రాణవాయి రథ చక్రాలు పేరుతో ఈ బస్సులను పిలుస్తున్నారు.ఆర్టీసీ సహకారంతో ఓ ఎన్జీఓ సంస్థ  ఈ బస్సులను  రూపకల్పనకు ముందుకు వచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios