Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు...

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

ap governament good news to retired rtc employees - bsb
Author
Hyderabad, First Published Apr 17, 2021, 1:33 PM IST

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు సర్కారు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. 

ఆ మొత్తాలని చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు. 

దాంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరిపిన ఆర్టీసీ అధికారులు.. చివరి రెండు విడతల బకాయిలను కూడా ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌  ఉత్తర్వులు జారీ  చేశారు. దీంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios