పీఆర్సీ కొత్త జీవో రద్దు: ఏపీ హైకోర్టులో ఉద్యోగ సంఘాల పిటిషన్

కొత్త పీఆర్సీ జీవోనురద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలైంది. 

AP Gazetted officers Association files petiton  against PRC New G.O. in AP High Court

అమరావతి: కొత్త Prc జీవోలను రద్దు చేయాలని కోరుతూ AP High Court లో ఉద్యోగ సంఘాలు గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశాయి. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తూ Andhra pradesh జీవో జారీ చేయడంపై గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గురువారం నాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారంగా బెనిఫిట్స్ తగ్గించవద్దని ఆ పిటిషన్ లో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ విషయమై జారీ చేసిన జీవోలను నిరసిస్తూ ఉద్యోగ సంఘాలు  ఆందోళన బాట పట్టాయి. ఏపీ NGOతో పాటు ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం సహా  పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమంటూ ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

మరో వైపు ఉేద్యోగ సంఘాలు సమ్మె కు వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ విషయమై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసును కూడా ఇవ్వనున్నాయి. ఈ విషయమై ఇవాళ ఉద్యోగ సంఘాలు మరోసారి సమావేశం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ట్రాప్ లో పడుతున్నారని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలతో తమకు వేతనాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ విబేధిస్తున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం 98 వేల కోట్ల నుండి 62 వేల కోట్లకు పడిపోయిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా సీఎస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేలా జీవోలు జారీ చేశామన్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios