కేసీఆర్ పై వెన్నుపోటుకు వెయిటింగ్: హరీష్ పై పేర్నినాని సంచలనం

వైసీపీపై, మంత్రులపై  తెలంగాణ మంత్రి హరీష్ రావు  చేస్తున్న విమర్శలపై  ఏపీ మాజీ మంత్రి  పేర్నినాని  కౌంటరిచ్చారు.  కేసీఆర్ కు  వెన్నుపోటు   పొడిచేందుకు  ప్రయత్నిస్తున్నారన్నారు.

AP Former  Minister  Perni Nani  Responds  On  Harish Rao  Comments  lns

తాడేపల్లి:  చంద్రబాబు ఎన్టీఆర్  ను వెన్నుపోటు పొడిచినట్టుగా  కేసీఆర్ ను దెబ్బతీసేందుకు  హరీష్ రావు  సమయం కోసం  చూస్తున్నారని  మాజీ మంత్రి  పేర్ని నాని  ఆరోపించారు.

ఏపీ మంత్రులపై, వైసీపీ నేతలపై  హరీష్ రావు  చేసిన వ్యాఖ్యలపై  పేర్నినాని  స్పందించారు. హరీష్ రావుది పదునైన బుర్ర అని  చెప్పారు.  హరీష్ రావు  తెలివైన  రాజకీయ నాయకుడని  ఆయన  చెప్పారు.  బీఆర్ఎస్ అంతర్గత  రాజకీయాలతో  హరీష్ రావు  వైసీపీపై విమర్శలు చేస్తున్నాడని  ఆయన  మండిపడ్డారు.కేసీఆర్ ను తిట్టలేక   జగన్ సర్కార్ పై , వైసీపీపై  హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని  పేర్ని నాని   తెలిపారు. మామపై  ఎప్పుడు  కడుపు రగిలినా  హరీష్ రావు  ఆంధ్రప్రభుత్వంపై  వైసీపీపై విమర్శలు  చేస్తున్నాడన్నారు. 

తనను కేసీఆర్  పట్టించుకోవడం లేదని  హరీష్ రావుకు  కోపం ఉందన్నారు. కేటీఆర్ , కవితలకు  కేసీఆర్ ప్రాధాన్యత  ఇవ్వడంపై  హరీష్ రావుకు  కడుపుమంటగా  ఉందన్నారు..మామ అల్లుళ్ల మధ్య  తగాదాలే   హరీష్ రావు  విమర్శలకు  కారణంగా  ఆయన  పేర్కొన్నారుు.  ఏపీపై  ప్రేమ ఉంటే  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎందుకు  అడ్డుకుంటున్నారని  కేసీఆర్ ను ప్రశ్నించారు  పేర్నినాని., .

also read:ఉట్టికి ఎగురలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుంది:విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ కు పేర్నినాని కౌంటర్

నోటితో  ప్రేమ చూపిస్తూ  నొసటితో  వెక్కిరించడం  కేసీఆర్ నైజంగా  ఆయన  పేర్కొన్నారు.. కేసీఆర్ ను తిట్టకపోతే  హరీష్ రావు  ఫీలవుతారని  పేర్నినాని  చెప్పారు. తెలంగాణ అభివృద్ది  చేశారని  బీఆర్ఎస్ నేతలు  చేస్తున్న  ప్రచారం గురించి  కూడా  స్పందించారు.  హైద్రాబాద్ , సిద్దిపేటలలో  రోడ్లు  ఉంటే  సరిపోతుందా  అని  ప్రశ్నించారు.  హైద్రాబాద్ లో రోడ్లు, మురికి కాలువలు  లేని ప్రాంతాలు  కూడా  ఉన్నాయన్నారు. మూసీ కంటే  ఘోరంగా  మురుగు కాలువలు  ప్రవహిస్తున్న పరిస్థితి హైద్రాబాద్ లో  ఉందన్నారు.  మామ, అల్లుళ్ల పాలన వద్దని  తెలంగణ వాసులు  కూడా  అంటున్నారని  పేర్నినాని  చెప్పారు. మాకు  కూడా  దోస్తులున్నారు.  తెలంగాణో  ఏం జరుగుతుందో  చెబుతారన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios